బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళింది వీళ్ళే.. ఉల్టా పల్టా హిట్టు!
on Sep 3, 2023
బిగ్ బాస్ సీజన్-7 మొదలైంది. కొత్త కంటెస్టెంట్స్ కొత్త రూల్స్ తో ఉల్టా పుల్టా సీజన్ సరికొత్తగా సాగింది. దాదాపు ఇప్పటి వరకు మనం ఊహించినట్టుగానే కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. డ్యాన్స్, పాటలతో ఒక్కో కంటెస్టెంట్ AV చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు మేకర్స్. ఈ సారి హౌజ్ లోకి వెళ్ళిన ఏ కంటెస్టెంట్ కన్ఫమ్ కాదంట, ఎవరైతే 'పవరస్త్ర' ని తమ పర్ఫామెన్స్ తో సాధిస్తారో వారే హౌజ్ మేట్ గా బిగ్ బాస్ హౌజ్ లో ఉంటారంట. అప్పటివరకు మాములు కంటెస్టెంట్ అని హోస్ట్ నాగార్జున చెప్పాడు.
బిగ్ బాస్ హౌజ్ లో ఈ సారి సోఫాలు, ఫర్నీచర్ ఏమీ లేవు. అవి కావాలంటే టాస్క్ లు ఆడి గెలుచుకోవాల్సిందేనంట. అయితే హౌజ్ లో కొత్తగా మూడు బెడ్ రూమ్ లు డిజైన్ చేశారు. అవి వీఐపీ బెడ్ రూమ్, డీలక్స్ బెడ్ రూమ్, స్టాండర్డ్ బెడ్ రూమ్. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి మొట్టమొదటి కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ వెళ్ళింది. అయితే తను వెళ్ళగానే నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక సూట్ కేస్ ఇచ్చి దానిని ఎవరికి కనపడకుండా దాచేయమనగా, తను హౌజ్ లోని జైల్ ఉండే వాష్ రూం లో దానిని దాచేసింది. అయితే హోస్ట్ నాగార్జునకి కొత్త పవర్స్ వచ్చాయి. హోస్డ్ ఎప్పుడు అయిన ఎలా అయిన రావడానికి హాలోగ్రామ్ దర్శినిని తీసుకొచ్చారు బిగ్ బాస్ మేకర్స్. అయితే సెకండ్ కంటెస్టెంట్ గా యాక్టర్ శివాజీ వచ్చాడు. మూడవ కంటెస్టెంట్ గా సింగర్ దామిణి వచ్చేసింది. తాజాగా దామిణి పాడిన కొండపొలం సినిమాలోని 'ధమ్ ధమ్' అనే పాటకి నేషనల్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇలా నేషన్ ప్రౌడ్ మూమెంట్ ఇచ్చిన దామిణిని సెలెక్ట్ చేశారు మేకర్స్. నాల్గవ కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. శుభశ్రీ అయిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతిక రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్ దీప్ ఇలా మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వెళ్ళారు. ఇక పదిహేనవ కంటెస్టెంట్ గురించి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడా? లేక మాములుగా తీసుకొస్తారా తెలియాల్సి ఉంది. సమంత, విజయ్ దేవరకొండ చేసిన ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. హౌజ్ లోని కంటెస్టెంట్స్ తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పదిహేనవ కంటెస్టెంట్ రాబోతున్నాడని నాగార్జున అమగానే.. జాతిర్నాలు హీరో నవీన్ పోలిశెట్టి వస్తాడు. అది చూసి నువ్వేంటి ఇక్కడ.. నువ్వు వెళ్తున్నావా హౌజ్ లోకి అనగానే అవునని నవీన్ పొలిశెట్టి అంటాడు. ఇక అంతే ఎట్లా భరించాలో ఏమో అన్నాక.. నవీన్ లోపలికి వెళ్తాడు. ఇక కొత్త కంటెస్టెంట్స్ తో కొత్త రూల్స్ తో మొదటిరోజు అందరిని పరిచయం చేసిన బిగ్ బాస్ .. తర్వాతి ఎపిసోడ్ లలో ఎలా ఉంటుందో చూడాలి మరి.
Also Read